Friday, July 11, 2008

ఓ నేస్తమా......!!!!

నను మురిపించిన నా నేస్తమా, వదిలెల్లమాకు నన్నొదిలెల్లమాకు

అంగట్లో కుళ్ళిన కూరగాయల కలగూర గంప వంటి ఈ ప్రపంచంలో

నీకూ నాకూ చోటు లేదు మిత్రమా, ఎటు చూసినా అరణ్య రోధన, ఎటు వెళ్ళినా అనన్య శోధన,

యంత్ర భూతాల మరణ మృదంగం, కాలుష్యపు కోరల వికటాట్టహాసం,

ప్లాస్టిక్ నవ్వుల పలకరింపులు, యాంత్రిక జీవన వికారపు చేష్టలు,

వికటించిన మనసు గతులు, సడలిన సాంప్రదాయపు విలువలు,

ఈ జీవన వాహినిలో, స్వచ్చమైన ఓ హృదయం కోసం, నిర్మలమైన మనసు కోసం,

నీ కోసం పరితపించే ప్రేమ కోసం, నిన్ను ప్రేమించే ఆ ప్రేయసి కోసం, వెతుకులాడుతున్నావా మిత్రమా...

అయితే ఓ జీవితకాలం నీది కాదనుకో... ఏమి నేస్తం ఎదురు చూశావా...

జీవిత కాలం అయిపోయిందని అసువులు బాసావా నేస్తం,

ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అంటూ విడువలేని ఆశతో తుది శ్వాస విడిచావా నేస్తం, నీ ఆశ

అడియాస ఆయెనని నన్ను కూడా దూరం చేశావా నేస్తం, ఒక జీవితకాలం నన్ను ఒంటరిని చేశావు

కదా నేస్తం.
"ఎవరు నువ్వు అని నన్ను అడిగితే -
ఏమని చెప్పను నా గురించి నేను...

ఇన్నేళ్ళ ఈ ప్రయాణాన్ని ఒక్కసారి వెను తిరిగి చూస్తే
నా ఈ జ్ఞాపకాల దొంతరలో
ఎన్నో అనురాగాలు,ఎన్నో మమకారాలు
ఎన్నో ఏవగింపులు,ఎన్నో ఈసడింపులు..

ఏమి సాధించానని నన్ను నేను ప్రశ్నించుకుంటే -
అసలు ఏమీ సాధించావంటు ఈ ప్రశ్న అని
నా అంతరంగం నవ్వుతుంది నన్ను చూసి..

చిత్రంగా లేదు -
కనీసం నా అంతరంగాన్ని అయినా సమాదానపరుచుకోవాలన్న
పట్టుదలతో ముందుకి సాగుతున్నాను......

ఒంటరితనం మనిషిని పిచ్చివాడిని చేస్తుంది అంటారు -
కాని అదే ఒంటరితనం నిన్ను నువ్వు తెలుసుకోవాడానికి,
నిన్ను నువ్వు మలుచుకోవాడానికి దొరికే సమయం అంటాను నేను...

ఈ ఒంటరితనపు నిశీదిలో
నిశ్శబ్దం భయంకరంగా ఉంటుంది అంటారు -
కాని అది నన్ను వెక్కిరిస్తుంది
నిన్ను నువ్వు తెలుసుకుంటు ఎన్నాళ్ళు ఇలా అనీ..

పాపం దానికేమి తెలుసు -
మనిషి ఆశకు అంతం ఉండదని
ప్రపంచం ఎంత తెలుసుకున్నా చేరని లోతు బావి అని....

అణువు అణువున స్వార్ధం నిండిన ఈ ప్రపంచం మీద నాకు -
ఏదో తెలియని ఆవేశం
ఏదో తెలియని ఆక్రొశం
ఏదో తెలియని ఆవేదన...

కాని -
రేపు ఎప్పుడు నిన్న లాగ ఉండదని నాది ఒక చిన్న ఆరాటం
రేపటీ ఆ వెలుగు కిరణాల కోసమే నా ఈ గమ్యం లేని ప్రయాణం.."
నా ప్రియ నేస్తం... నా ప్రియ నేస్తం...

నా ఊహల్లో తను నిండిపొయింది
తన గుండెల్లో నన్ను దాచుకుంది
నా స్నేహం తాను అందుకుంది
తన లోకం నేనే అని అంది

నన్ను ఒక్కసారిగా తను వీడిపొయింది
మరల తిరిగి రాని లోకాలకు చేరిపోయింది
నా గమ్యం సూన్యం అయ్యింది
తను ఒంటరిగా నన్ను మిగిల్చింది

నేనూ తన దరిచేరతాను అంటే
తన ఙ్ఞాపకాలు నాకు తోడుంటాయని
నా ఊహాల్లొ తను ఎప్పుడు జీవిస్తానని
తను నన్ను వీడిపోతూ చివరిగా నాతో అంది

నా ఊహల్లో ఎల్లప్పుడు జీవించే నా నేస్తానికి
ఇది నేను అందించె ఒక కవితా కుసుమం
ఈ కుసుమ పరిమళాలు నా నేస్తనికి
చేరుతాయని ఆశతో ఎదురుచూస్తున్నాను

Tuesday, July 8, 2008

హాయ్ నేస్తం...
చిరునవ్వులాంటి నీ స్నేహం నాకు దేవుడు ఇచ్చిన వరం,
నీ స్నేహం అంతులేనిది, అతీతమైనది, స్వార్ధం లేనిది.
అలాంటి నీ స్నేహం నాకు ఇలాగే ఉండాలని ఆశిస్తూ ఎప్పటికి నిను మరచిపోలేని

నీ నేస్తం...

Thursday, July 3, 2008

భూమి కంపించిపోలేదు
గాలి స్తంభించలేదు
నిన్న నువ్వు రాకపోతే…

నా హృదయస్పందనలు ఆగిపోవు
నా ఉచ్చ్వాస నిశ్వాసలు నిలిచిపోవు
రేపు నువ్వు రాకపోతే…

కళకోసం,కలల కోసం
నవ్యత్వం కోసం, కవిత్వం కోసం
ఎన్నేళ్ళనుంచని ఈ ఎదురుచూపులు…

అవ్యక్త స్వప్నాల్లోనూ
నిత్య మనోగతుల్లోనూ
నీ కొరకేగా ఈ ఎదురుచూపులు…

అజ్ఞానం అస్తమించాలి
ప్రజ్ఞానం ఉదయించాలి
అలంటి రోజు కోసమే నా నిరీక్షణ

నేడు కాదు, రేపు కాదు,
దశాబ్దం కాదు, శతాబ్దం కాదు,
చివరిదాకా ఆగదు నా నిరీక్షణ.

నీకై ఎదురుచూస్తూ నాకు ధుమ్ముధూళి పట్టేస్తే
నేనెవరో అని నువ్వు గుర్తుపట్టక వదిలేస్తే
నెనేమైపోతనోన్నన్న భయం.

కనికరించి నువ్వు నిజంగానే వస్తే
నా అనాకార రూపం చూస్తే
మళ్ళీ వెళ్ళిపోతావేమోనన్న భయం.

Thursday, June 12, 2008

కన్నులు కలలను మరచిపోవు...
ఊపిరి శ్వాసను మరచిపోదు...
వెన్నెల చంద్రుడిని మరచిపోదు...
నా మనసు నీ స్నేహన్ని మరచిపోదు...


విరిసిన వెన్నెల కరిగిపోతుంది...
వికసించిన పువ్వు వాడిపోతుంది..
కాని చిగురించిన మన స్నేహం చిరకాలం మిగిలిపోతుంది...


వద్దన్నా వచ్చేది మరణం...
పోవద్దన్నా పోయేది ప్రాణం..
తిరిగి రానిది బాల్యం....
మరువలేనిది మన స్నేహం..


కుల మత బేధం లేనిది...
తరతమ భావం రానిది...
ఆత్మార్పణమే కోరుకొనేది...
ప్రతిఫలమన్నది ఎరుగనిది...స్నేహమది

Wednesday, June 11, 2008

వాన వస్తే కాగితాలే పడవాలయ్యే జ్ఞాపకాలే;
నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్ని చెంత వాలే;
గిళ్లీకజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుల్లింతాల్లో తేలే స్నేహం;
మొదలు,తుడాలు తెలిపే ముడి వీడకున్డె;
ఒంటరైన,ఓటమైన;వెంట నడిచే నీడ నీవె;