Thursday, June 12, 2008

కన్నులు కలలను మరచిపోవు...
ఊపిరి శ్వాసను మరచిపోదు...
వెన్నెల చంద్రుడిని మరచిపోదు...
నా మనసు నీ స్నేహన్ని మరచిపోదు...


విరిసిన వెన్నెల కరిగిపోతుంది...
వికసించిన పువ్వు వాడిపోతుంది..
కాని చిగురించిన మన స్నేహం చిరకాలం మిగిలిపోతుంది...


వద్దన్నా వచ్చేది మరణం...
పోవద్దన్నా పోయేది ప్రాణం..
తిరిగి రానిది బాల్యం....
మరువలేనిది మన స్నేహం..


కుల మత బేధం లేనిది...
తరతమ భావం రానిది...
ఆత్మార్పణమే కోరుకొనేది...
ప్రతిఫలమన్నది ఎరుగనిది...స్నేహమది

Wednesday, June 11, 2008

వాన వస్తే కాగితాలే పడవాలయ్యే జ్ఞాపకాలే;
నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్ని చెంత వాలే;
గిళ్లీకజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుల్లింతాల్లో తేలే స్నేహం;
మొదలు,తుడాలు తెలిపే ముడి వీడకున్డె;
ఒంటరైన,ఓటమైన;వెంట నడిచే నీడ నీవె;

Thursday, June 5, 2008

రేకులు విచ్చిన లేత సోయగమా
వెన్నెలకే కందిపోవు నవయవ్వనమా
కన్నులలో దాచితివేమది నీలి సంద్రమా
నీ లలాటమే విశాల గగనమా
నా ప్రేమను తెలుపుటకు ఇదే మంచి తరుణమా
ఓ తరునమా!
నా మొరాలించి కాస్త కరుణ చూపుమా

ఓ చెలీ!

శ్రీవాణీ వీణా సుస్వర గీర్వాణాలో
రాచిలకల ముద్దు ముద్దు పలుకులో
నయాగరా జలపాత ఘోషలో ఓ చెలీ నీ మాటల్!

మత్తకోకిలల ఉషోదయ రాగాలో
ద్విరేఫపు ఝుంకార నాదాలో
కరిగిన నింగి కరతాళధ్వనులో ఓ చెలీ నీ పాటల్!

ఆభోగీ రాగ ఆరోహణలో
ఉత్పలమాలా ఛంధోగమనమో
వృద్ధ గంగా వినిర్మల ప్రవాహములో ఓ చెలీ నీ నడకల్!
అలలకి అలుపు లేదు,
సిలలకి చూపు లేదు,
కలలకి రూపు లేదు,
వూహలకి అంతం లేదు,
మౌనానికి భాష లేదు,
ప్రేమ దాపు లేదు,
నాకు పని లేదు,
నీకు పని రాదు,
మనకి ఇంక హైక్ రానే రాదు.

Sunday, June 1, 2008

అనుకున్నామని జరగవు అన్నీ...
అనుకోలేదని ఆగవుకొన్నీ...
జరిగేవన్నీ మన మంచికనీ...
అనుకోవడమే జివితం...